భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు కూడా గడ్డుకాలం ఎదురయ్యింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిని పూర్వ విద్యార్థులు ఆదుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటం, ప్రైవేటు యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించటంతో నెల్లూరు నగరానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే ఉపాధ్యాయుడు అరటిపండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వైనంపై 'ఈటీవీ, ఈటీవీ భారత్'లో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలకు స్పందించిన తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు పరిస్థితి చూసి పూర్వ విద్యార్థులు చలించిపోయారు. 2014-15 బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయుడిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. స్నేహితులందరి సహకారంతో రూ.86,300 నగదు పోగుచేసి తమ గురువుకు అందజేశారు. పెద్ద మనసుతో తన విద్యార్థులే తనను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయుడు వెంకటసుబ్బయ్య అన్నారు.
గురువును ఆదుకున్న పూర్వ విద్యార్థులు - undefined
లాక్‌డౌన్ కారణంగా ఓ ఉపాధ్యాయుడి బతుకు ఒక్కసారిగా మారిపోయింది. కుటుంబ పోషణ కోసం రోడ్లపై అరటిపళ్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వైనంపై 'ఈటీవీ, ఈటీవీ భారత్'లో వచ్చిన కథనాలకు స్పందించి తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఆదుకునేందుకు పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు.
భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు కూడా గడ్డుకాలం ఎదురయ్యింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిని పూర్వ విద్యార్థులు ఆదుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటం, ప్రైవేటు యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించటంతో నెల్లూరు నగరానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే ఉపాధ్యాయుడు అరటిపండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వైనంపై 'ఈటీవీ, ఈటీవీ భారత్'లో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలకు స్పందించిన తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు పరిస్థితి చూసి పూర్వ విద్యార్థులు చలించిపోయారు. 2014-15 బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయుడిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. స్నేహితులందరి సహకారంతో రూ.86,300 నగదు పోగుచేసి తమ గురువుకు అందజేశారు. పెద్ద మనసుతో తన విద్యార్థులే తనను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయుడు వెంకటసుబ్బయ్య అన్నారు.
ఇదీ చూడండి: యువతపై కరోనా దెబ్బ...పెరగనున్న నిరుద్యోగం రేటు
TAGGED:
students help for teacher