ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నెల్లూరులో కంచి మఠానికి సదాశయంతో ఇచ్చిన గృహాన్ని సంస్కృతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీజగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. బాలు కుటుంబీకులు సంగీతానికి చేస్తున్న సేవలను స్వామిజీ కొనియాడారు. వేద పాఠశాల నిర్వహించేందుకు తిప్పరాజువారి వీధిలోని ఇంటిని ఎస్పీ బాలు కంచి మఠానికి అప్పగించారు. కంచి మఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడం తమ అదృష్టమని ఆయన అన్నారు.
ఇదీ చదవండి :