నెల్లూరులో దాదాపు మూడు లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నగరంలోని కుక్కలగుంట ప్రాంతంలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. స్థానికంగా ఉండే ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు చెందిన వ్యక్తులు మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.... ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి