ETV Bharat / city

MURDER CASE CHASED : కౌన్సిలర్ హత్య కేసు ఛేదన... ఆధారాల కోసం పోలీసుల దర్యాప్తు - nellore district crime

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సంచలనం కలిగించిన కౌన్సిలర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 16వ వార్డు కౌన్సిలర్ సురేశ్​​ ను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచారు.

కౌన్సిలర్ హత్య కేసు ఛేదన
కౌన్సిలర్ హత్య కేసు ఛేదన
author img

By

Published : Aug 21, 2021, 3:22 AM IST

నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట మునిసిపాలిటీ పదహారో వార్డు కౌన్సిలర్ సురేశ్... తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లాడు. దర్శనం ముగించుకుని ఇంటికి వచ్చి, కారును పార్కింగ్ చేస్తుండగా... సురేశ్ బినామీగా ఉన్న తంగి బాలు కత్తితో సురేశ్​​ను దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు తంగి బాలును పోలీసులు అరెస్టు చేశారు.

సురేశ్‌ను చంపేస్తే... తన పేరు మీద ఉన్న ఆస్తిని పూర్తిగా హస్తగతం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ నెల జులై నుంచే హత్యకు బాలు ప్రయత్నాలు చేశాడని విచారణలో వెల్లడైంది. కేసుకు సంబంధించిన మరిన్ని సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి

ARREST: నకిలీ చలానాల కేసులో ముగ్గురు డాక్యుమెంట్​ రైటర్లు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.