నెల్లూరు నగరంలో రహదారులను నాసిరకంగా నిర్మిస్తున్నారంటూ.. తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదని.. నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆందోళన నిర్వహించారు. మినీ బైపాస్ నుంచి శెట్టిగుంట వరకు రూ. 3.60 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు వద్ద.. కనీసం ప్రభుత్వ పర్యవేక్షణాధికారి లేరని విమర్శించారు.
మంత్రి బంధువులే రోడ్డు పనులు దక్కించుకుని.. ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులతోపాటు కేంద్ర మంత్రి గడ్కరీకి ఫిర్యాదు చేస్తామన్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టకుంటే.. ప్రజా ఉద్యమానికి వెనకాడబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
అటవీ సిబ్బందిపై ఎర్ర చందనం స్మగ్లర్ల దాడి.. ఎదురు తిరిగేసరికి పరార్