ETV Bharat / city

ప్రముఖుల పేరుతో మోసం... కోటికిపైగా వసూలు

author img

By

Published : Nov 27, 2019, 10:05 PM IST

రాజకీయ నేతల పీఏను అని... అమాయకులను మోసగించి రూ.కోటీ వరకు దోచుకున్న వ్యక్తిని... నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా... విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు.

cheater
మోసగాడు
ప్రముఖుల పేరుతో మోసం... కోటికిపైగా వసూలు

ప్రముఖుల పేర్లు చెప్పి... అమాయకులను మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని నెల్లూరులో పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో... విచారణ చేపట్టిన పోలీసులు వంశీకృష్ణ అనే మోసగాన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మంత్రి మేకపాటితోపాటు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పీఏనంటూ... నమ్మించి రూ.కోటికిపైగా వసూలు చేసినట్లు నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

నెల్లూరు జిల్లా గూడూరు మండలానికి చెందిన గుండాల వంశీకృష్ణారెడ్డి... ప్రస్తుతం నెల్లూరులోని వనంతోపు సెంటర్లో నివాసం ఉంటున్నాడు. 2013లో యాంటీ రేడియేషన్ చిప్ వ్యాపారం చేసి నష్టపోయిన వంశీ... అక్రమంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. అప్పటి నుంచి హత్యలు, అత్యాచారం, నమ్మకద్రోహం వంటి నేరాలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పీఏ నంటూ అనేక మందితో పరిచయాలు పెంచుకున్నాడు.

ప్రభుత్వం నుంచి పనులు చేసిపెడతానంటూ... వారి నుంచి డబ్బు వసూలు చేశాడు. ఓ వ్యక్తికి ఆర్వో ప్లాంట్ ఇప్పిస్తానని చెప్పి రూ.35 లక్షలు, హైదరాబాద్​లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం విషయంలో మరో వ్యక్తి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్టు చెప్పారు. విశాఖలో రాజు అనే వ్యక్తికి మైనింగ్ లీజు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.40 లక్షలు వసూలు చేశాడని, నకిలీ ఆధార్ కార్డులనూ తయారు చేశాడని డీఎస్పీ వివరించారు. హత్య కేసు, దిల్లీ యువతిపై హైదరాబాద్​లో అత్యాచారం, అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వంశీకృష్ణారెడ్డిపై పీడీ యాక్టు చట్టం కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వివరించారు.

ఇదీ చదవండి

ఏపీలో భారీ ప్రాజెక్టు... ప్రపంచ బ్యాంక్ సాయం

Intro:Ap_Nlr_06_27_Minister_Perutho_Vasullu_Arest_Kiran_Avb_R_AP10064

సార్ స్క్రిప్టు పంపాను పరిశీలించగలరుBody:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.