నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎంఎన్‌వో ప్రేమ్ కుమార్ శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడికి వైద్యులు చికిత్స అందించారు. ఆర్నెల్లుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఆత్మహత్యకు ప్రయత్నించానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
చికిత్స పొందుతున్న బాధితుడిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తెదేపా నేత అబ్దుల్ అజీజ్ పరామర్శించారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సర్దిచెప్పగా.. ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు ధర్నా చేపట్టారు. వేతనాలు అందక పూట గడవడమే కష్టంగా మారిన తమను ఆదుకోవాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'వార్తల్లో నిలవడం కోసమే ఎస్పీని తిట్టారు'