ETV Bharat / city

Goutham Reddy: గౌతమ్‌రెడ్డి కడచూపు కోసం.. తరలివస్తున్న అభిమానులు, కార్యకర్తలు

Goutham Reddy: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం నెల్లూరు చేరుకుంది. ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలోనే పార్థివదేహాన్ని ఉంచారు. తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గౌతమ్ రెడ్డి నివాసానికి తరలివచ్చి.. నివాళులర్పిస్తున్నారు.

Minister Gautam Reddy
Minister Gautam Reddy
author img

By

Published : Feb 22, 2022, 10:52 AM IST

Updated : Feb 22, 2022, 6:14 PM IST

గౌతమ్‌రెడ్డి కడచూపు కోసం.. తరలివస్తున్న అభిమానులు, కార్యకర్తలు

Goutham Reddy Passed away: సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరులోని ఆయన నివాసానికి తరలించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి ఈ ఉదయం... భౌతిక కాయాన్ని బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడినుంచి ప్రత్యేక విమానం ద్వారా నెల్లూరుకు తరలించారు. ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలోనే పార్థివదేహాన్ని ఉంచారు. తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గౌతమ్ రెడ్డి నివాసానికి తరలివచ్చి.. నివాళులర్పిస్తున్నారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత నివాళులర్పించారు. నెల్లూరులో మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయ సందర్శన, అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం గౌతమ్‌ రెడ్డి అంతిమయాత్ర రోడ్డు మార్గంలో ఉదయగిరి వరకు జరుగుతుందన్నారు. అంత్యక్రియలకు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని అనిల్ చెప్పారు.

సహచర మంత్రిని కోల్పోవడం పట్ల రాష్ట్ర మంత్రులు తీవ్ర సంతాపం తెలిపారు. నెల్లూరులోని గౌతమ్‌రెడ్డి నివాసం వద్ద ఆయన మృతదేహానికి మంత్రులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని మంత్రులు సుచరిత, గుమ్మనూరి జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మరణం వైకాపా, ప్రజలకు తీవ్ర లోటని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణా రావు అన్నారు. ఎప్పూడు చిరునవ్వుతో ఉండే సహచరుడు లేకపోవడం చాలా బాధగా ఉందని మంత్రి శంకరనారాయణ అన్నారు. వైకాపా శ్రేణులకు గౌతమ్ రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలింపు..

మంగళవారం ఉదయం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి... అక్కడినుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో నెల్లూరు తరలించారు. హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఎయిర్‌ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులతో పాటు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. మరోవైపు ఇప్పటికే అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి బయల్దేరారు. ఈ సాయంత్రానికి ఆయన చేరుకునే అవకాశముంది. రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

గౌతమ్ రెడ్డి మృతి.. ఏం జరిగిందంటే..?
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్‌ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అనంతరం గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు 9.16గంటలకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు.

గౌతమ్‌రెడ్డి రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఇదీ చదవండి:

Gowtham Reddy Live Updates: నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు

Last Updated : Feb 22, 2022, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.