కరోనా వైరస్ నేపథ్యంలో నెల్లూరులో లాక్డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 9 గంటల వరకు పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతిస్తున్న పోలీసులు, తర్వాత ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ప్రతి డివిజన్లో కూరగాయల విక్రయ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకుని తిరిగే ఆటోలను సీజ్ చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవడటంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చదవండి: స్వీయ నిర్బంధంలో తినకూడనవి ఇవే...