బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు(Farmers problems with Heavy rains) కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వాన నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వారం క్రితం నాటి వర్ష బీభత్సం నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంట నష్టపోయిన రైతులు.. మళ్లీ వర్షం కురుస్తుండడంతో పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.