నెల్లూరులో లాక్డౌన్ అమలు తీరును జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లు ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసులు చేపడుతున్న భద్రతా చర్యలను, నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. స్టోన్ హౌస్ పేటలో లాక్డౌన్ సమయంలో ప్రజలు తిరుగుతున్నారనే ఫిర్యాదులు రావడం వల్ల అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే షాపులు తెరవాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నిత్యావసరాలు డోర్ డెలివరీ అవుతున్నాయా అని ఇళ్లలో ఉంటున్న ప్రజలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నగరంలోని కిమ్స్ నర్సింగ్ కళాశాలను, జీజీహెచ్‌ని సందర్శించారు. కొవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్‌కి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీహరికి తెలిపారు. జీజీహెచ్‌లోని 15 విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీని చేపట్టాలని, త్వరితగతిన కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి :
పట్టణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు ఎక్కువ: కలెక్టర్ శేషగిరిబాబు