దొంగనోట్ల చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పైపాడు గ్రామానికి చెందిన వీరబోగు పుల్లన్న, మల్లెపోగు రాజశేఖర్ కర్నూలులోని ఓఎలక్ట్రానిక్ దుకాణంలో టీవీ కొనుగొలు చేసి నకీలీ నోట్లు ఇచ్చారు. షాపు యజమాని గుర్తించి అడిగేలోపు ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా దొంగనోట్ల చెలామణికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 1 లక్ష 94 వేల రూపాయల నకీలీ నోట్లను స్వాదీనం చేసుకున్నట్లు సీ.ఐ. పార్థసారధి రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: కాబోయే భర్త వేధింపులు భరించలేక.. యువతి ఆత్మహత్య