ETV Bharat / city

ఆపదలో ఆమె - ఆపదలో ఆమె

చట్టాలు అమలవుతున్నా... శిక్షలు విధిస్తున్నా మహిళలపై మృగాల ఆకృత్యాలు ఆగటం లేదు. ఉరి శిక్ష విధించే తీవ్రమైన నిర్భయ చట్టాన్ని సైతం కామాంధులు ఖాతరు చేయక అత్యాచారాలకు బరి తెగిస్తున్నారు. ఎక్కడో ఓ చోట నిత్యం జరిగే దారుణాలు మహిళలను అభద్రతాభావానికి గురిచేస్తున్నాయి. స్వేచ్ఛగా ఒంటరిగా తిరగ లేని దుస్థితి నెలకొంది. గత ఏడాది హైదరాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలిపై జరిగిన సామూహిక హత్యాచార ఘటన తర్వాత తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఉదంతం మరోసారి ఉలికిపాటుకు గురిచేసింది. ఈ క్రమంలో ఆడపిల్ల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

she was in danger
ఆపదలో ఆమె
author img

By

Published : Oct 7, 2020, 5:19 PM IST

కర్నూలు జిల్లాలో కీచకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దారుణాలను పరిశీలిస్తే.. మహిళలు, యువతుల పైనే కాకుండా జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, అభంశుభం తెలియని పసిపిల్లల పైనా అత్యాచారాలు జరుగుతున్నాయి. అధిక కేసుల్లో బాధితుల సుపరితులే అఘాయిత్యాలకు పాల్పడుతుండటం గమనార్హం. యువకులు వృద్ధులతోపాటు బాలలు సైతం అత్యాచారాలకు బరి తెగిస్తున్నారు. ఒంటరిగా దొరికిన సమయాల్లో, నమ్మించి తీసుకెళ్లిన సందర్భంలో అధికంగా ఇలాంటివి జరుగుతున్నాయి. పిల్లల విషయంలో ప్రలోభానికి గురిచేసి తీసుకెళ్లటం, బాలికలను ప్రేమ పేరుతో నమ్మించి తీసుకెళ్లి అత్యాచారాలు చేస్తున్నారు. మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసి గుర్తు పట్టని విధంగా కాల్చిచంపిన అమానవీయ ఘటనలు జిల్లాలో జరిగాయి. ఇటీవల కర్నూలులో ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడగా బనగానపల్లి పరిధిలో ఐదు మాసాల గర్భిణీపై అత్యాచారం జరిగింది. ఈ ఏడాది కరోనా మహిళలను అత్యాచారాల నుంచి కాపాడిందని చెప్పవచ్చు. ఈ కారణంగానే ఈ ఏడాది తక్కువ కేసులు నమోదయ్యాయి. పరువు కోసం ఫిర్యాదు చేయని బాధితులూ ఉన్నారు. మొత్తానికి బాలికలపైనే లైంగిక దాడులు అధికంగా జరుగుతున్నాయి.

ఆటో నేరగాళ్లపై నిఘా ఏదీ?

జిల్లా కేంద్రంలో పలువురు ఆటోడ్రైవర్లు గతంలో అత్యాచారాలకు పాల్పడ్డారు. బాధితుల్లో ఓ వైద్యురాలూ ఉన్నారు. మట్టి రవి, శ్రీనివాసులు వంటి నేరగాళ్లు ఆటోడ్రైవర్ల ముసుగులో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసులు వాళ్లను కటకటాల్లోకి పంపేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆటో నేరగాళ్లను దృష్టిలో ఉంచుకుని అప్పటి ఎస్పీ గోపీనాథ్‌జెట్టి మహిళల భద్రత కోసం ఆటో డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టారు. డ్రైవర్ల సీటు వెనుక ఉండే ప్రయాణికులు గుర్తించే విధంగా డిజిటల్‌ కార్డులు ఏర్పాటు చేయించారు. ఆయన బదిలీతో ఈ విధానం అటకెక్కింది. ప్రస్తుతం పలువురు ఆటో డ్రైవర్ల తీరు చూసి మహిళలు భయపడుతున్నారు.

షీ, శక్తి టీమ్‌లు కనుమరుగు

మహిళల భద్రత కోసం గతంలో అన్ని సబ్‌ డివిజన్లలో షీ టీమ్స్‌ ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రమాదం నెలకొన్న ప్రదేశాల్లో ఆయా బృందాలు తిరిగి కీచకుల వివరాలు సేకరించి వారి కదలికలపై నిఘా ఉంచి ముందస్తు చర్యలు తీసుకునేవారు. తర్వాత పోలీసు ఉన్నతాధికారులు షీ టీమ్స్‌ పేరును శక్తి టీమ్‌గా మార్చారు. ప్రభుత్వం మారటంతో ప్రస్తుతం ఆయా బృందాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశా పోలీసుస్టేషన్‌ పనితీరు మెరుగుపడాల్సి ఉంది. మహిళల భద్రత కోసం దిశా యాప్‌ను రూపొందించగా జూన్‌ వరకు 18 ఫిర్యాదులు రాగా నాలుగు కేసులు నమోదు చేశారు. ఆవగాహన ఉన్న మహిళలు ఈ యాప్‌ను డౌన్‌లోడు చేసుకుంటున్నారు. పోలీసు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి యాప్‌ పనితీరుపై అవగాహన కల్పించి డౌన్‌లోడు చేయిస్తున్నారు.

దిశా యాప్‌ పనితీరు ఇలా..

అండ్రాయిడ్, ఐఓఎస్‌ చరవాణులలో గూగుల్‌ ప్లేస్టోర్‌లో దిశా యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవచ్చు. అంతర్జాలం లేకున్నా ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. ఆపదలో ఉన్నవారు ఫోన్‌లో ఈ యాప్‌ ఓపెన్‌ చేసి అత్యవసర సాయం నొక్కితే చాలు వారి ఫోన్‌ నెంబరు, చిరుమానా, వారున్న ప్రదేశం వివరాలు సహా కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందుతుంది. అక్కడి నుంచి వెనువెంటనే సమీప పోలీసుస్టేషన్‌కు ఫోన్‌ వెళ్తుంది. దిశా యాప్‌లోని ట్రాక్‌ మై ట్రావెల్‌ ఆప్షన్‌ వినియోగించి వెళ్లాల్సిన ప్రదేశం నమోదు చేసుకోవచ్చు. ఆపదలో ఇతరులకు సమాచారం ఇవ్వవచ్చు. ఈ యాప్‌లో 100, 112 ఫోన్‌ నెంబర్లు ఉంటాయి. 100కు ఫోన్‌ చేసి సమస్య చెప్పాలి. 112కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా సరిపోతుంది.

ఇదీ చదవండి:

అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.