ETV Bharat / city

తుంగభద్ర పుష్కరాల్లో నదీ స్నానం నిషేధం: కలెక్టర్ - తుంగభద్ర పుష్కరాల్లో నదీ స్థానం నిషేధం వార్తలు

తుంగభద్ర పుష్కరాల నిర్వహణ విషయంలో గత కొంతకాలంగా ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. కరోనా సమయంలో... పుష్కరాలు జరపటం, పుణ్యస్నానాలు ఆచరించటం వల్ల వైరస్ విస్తరించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో... పుష్కరాల్లో నదీ స్నానాలను నిషేధిస్తూ కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు.

tungabhadra pushkaralu 2020
tungabhadra pushkaralu 2020
author img

By

Published : Nov 9, 2020, 9:47 PM IST

తుంగభద్ర పుష్కరాలను నిర్వహించేందుకు అధికారులు గత మూడు నెలలుగా చర్యలు చేపట్టారు. వివిధ విభాగాల నుంచి ఘాట్ల నిర్మాణాలు, రహదారులు, సుందరీకరణ తదితర పనుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. అన్ని పనుల కోసం సర్కారు 208 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి గత రెండు వారాలుగా పనులు ప్రారంభించారు. కొన్ని ఘాట్లు దాదాపు పూర్తయ్యాయి. రహదారులు, విద్యుదీకరణ, మురుగు నీరు తరలింపు తదితర పనులు జరుగుతున్నాయి.

వైద్య ఆరోగ్య శాఖ సూచనతో..

ఈనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు 12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలు జరగాల్సి ఉంది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 21 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. అక్కడికి వెళ్లేందుకు రహదారులు సైతం నిర్మిస్తున్నారు. ఈ తరుణంలో లక్షల్లో జనం గుమికూడే అవకాశం ఉండటం, కరోనా మరోసారి విజృంభిస్తుందన్న సమాచారంతో.. ఇది అత్యంత ప్రమాదకరమని వైద్య ఆరోగ్యశాఖ... ఉన్నతాధికారులకు సూచన చేసింది. ఈ కారణంగా.. పుష్కర స్నానానికి అనుమతి ఇవ్వడం లేదని, పిండ ప్రదానం, పూజలు వంటి కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించేందుకు అవకాశం ఇస్తున్నామని దేవాదాయశాఖ కార్యదర్శి గత నెల 22 న మెమో జారీ చేశారు.

గత పుష్కరాలకు 49 లక్షల మంది హాజరు

2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. ఈ పుష్కరాలకు సుమారు 49 లక్షల మంది హాజరయ్యారు. ఈ సారి కరోనా ఉండటంతో అధికారులు ప్రచార ఆర్భాటాలకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. దీని కోసం 12 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి అనుమతి లేదని, ఈ-టికెట్ విధానంలో స్లాట్ బుక్ చేసుకున్నవారినే అనుమతించాలని, ఒక్కో ఘాట్​లో గంటకు 60 మంది కన్నా ఎక్కువమందిని అనుమతించరాదని నిర్ణయించారు.

తుంగభద్ర నది పుష్కరాల గోడ పత్రిక, లోగోను కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఆవిష్కరించారు. పుష్కర ఘాట్లు, నగరంలోని ప్రధాన కూడళ్లు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని మండలాల్లో పోస్టర్లు ప్రదర్శించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, పుష్కర నదీ స్నానాలకు అనుమతి లేదని, కేవలం సంప్రదాయ పూజలకు మాత్రమే అనుమతిస్తామని ప్రచారం చేయాలని... సమాచార పౌర సంబంధాల శాఖ ఉపసంచాలకులు తిమ్మప్పను ఆదేశించారు. పుష్కరాల ఘాట్లు, ఏర్పాట్లన్నీ యథాతథంగా ఈ నెల 13 లోపు పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

విమర్శలు...

పుష్కరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఘాట్లు నిర్మించినా ప్రస్తుతం ప్రయోజనం ఉండదు. ఘాట్లకు రహదారుల వల్ల ఉపయోగం లేదు. కేవలం పూజలు, పిండ ప్రదానాలకు షెడ్లు నిర్మించి ఉంటే సరిపోయేదని... ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:

వీర జవాను ప్రాణత్యాగం వెలకట్టలేనిది : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.