కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో కోతులు హల్ చల్ చేస్తున్నాయి. ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని అంటున్నారు. వీధి వ్యాపారులు వీటి దెబ్బకు హడలెత్తిపోతున్నారు. విక్రయించే పండ్లు తినుబండారాలను ఎత్తుకెళ్లడమే కాక అడ్డుకుంటే మీద పడి కరిచేందుకు సిద్ధమవుతున్నాయంటున్నారు.
ప్రజలు, వ్యాపారులు భయపడి వాటికి దూరంగా ఉండటం తప్ప ఏమి చేయలేక పోతున్నారు. ఈ సమస్యను చాగలమర్రి ఈవో సుదర్శనరావు దృష్టికి తీసుకెళ్లగా కోతుల సమస్యను అరికడతామని, త్వరలోనే వాటిని పట్టుకుని దూరంగా తరలిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: పట్టాల పంపిణీని తెదేపా అడ్డుకుందనడం విడ్డూరం: కళా