కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ జన్మదిన వేడుకలను.. అనుచరులు ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగృహంలో వేడుక చేశారు. పార్టీ వైకాపా నేత, ఏపీ బెస్త కార్పొరేషన్ ఛైర్ పర్సన్ సుధారాణి బెస్త సోదరుడు, అఖిల భారత గంగపుత్ర యువజన మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ బెస్త హాజరయ్యారు. ఎమ్మెల్యే హఫీజ్‌కు కేకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
కర్నూల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న గంగపుత్రులకు అండగా నిలవాలని అనిల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల బెస్త కులస్థులు ఉన్నారని అనిల్ పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సంప్రదాయ మత్స్యకారులు గంగపుత్రులు, బెస్త కులస్థులకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి బెస్త కులస్తుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు.