ETV Bharat / city

SEED PARK: బీడుగా మెగా సీడ్ పార్క్.. ఆవేదనలో రైతులు - kurnool district news

రాష్ట్ర విత్తనోత్పత్తి భాండాగారంగా పేరు పొందిన.. కర్నూలు జిల్లాలోని తంగడంచె భూములు బీడుగా దర్శనిమస్తున్నాయి. వందలాది ఎకరాలు ఇప్పుడు ముళ్ల పొదలతో నిండిపోయాయి. నిధులు, సౌకర్యాల్లేక విత్తనోత్పత్తి చేయలేని దుస్థితికి కర్నూలు జిల్లా మెగా సీడ్ పార్క్ చేరుకుంది.

బీడుగా మెగా సీడ్ పార్క్.. ఆవేదనలో రైతులు

author img

By

Published : Aug 22, 2021, 7:05 PM IST

బీడుగా మెగా సీడ్ పార్క్.. ఆవేదనలో రైతులు

కర్నూలు జిల్లా తంగడంచెలో 1625 ఎకరాల సారవంతమైన భూములు ఉన్నాయి. ఇందులో జైన్ ఇరిగేషన్‌కు, మెగా సీడ్‌ పార్క్‌కు 625 ఎకరాలు చొప్పున గత ప్రభుత్వం కేటాయించింది. దేశంలో వివిధ రాష్ట్రాలు సహా విదేశాలకూ విత్తనాలు సరఫరా చేసే భాండాగారంగా మెగా సీడ్‌ పార్క్‌ను తీర్చిదిద్దేందుకు 2017లో రూ. 325 కోట్లు కేటాయించారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ మూలనపడ్డాయి. తంగడంచె భూములను ఆనుకుని కేసీ కాలువ ఉంది. గతంలో కాలువల ద్వారా భూములకు నీరు మళ్లించి సాగు చేసేవారు. ఇప్పుడు కాలువలు పూర్తిగా దెబ్బతినటం వల్ల వర్షంపైనే ఆధారపడాల్సి వస్తోంది.

రైతుల ఆవేదన..

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో కేవలం 91 ఎకరాలే సాగులోకి వచ్చాయని.. మిగతా భూములన్నీ నిరుపయోగంగా మారుతున్నాయని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. తంగడంచె విత్తనోత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం ముగ్గురు ఏవోలు ఉన్నారు. సరిపడా నిధులు కేటాయించి ఈ కేంద్రం నుంచి విత్తనోత్పత్తి జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Hydrographic Survey: శ్రీశైలం జలాశయంలో పూడికపై సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.