కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తిపై కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్‌కు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడిందని లేఖలో తెలిపారు. కర్నూలు జిల్లాపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న కోట్ల.. కరోనా కట్టడికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో కరోనా పరిస్థితి పరిశీలనకు ప్రత్యేక బృందాన్ని పంపాలని కోరారు. పరిస్థితి చేయిదాటక ముందే కేంద్ర వైద్యశాఖ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి : 'కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం'