కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకొని విచారించారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌లను తనిఖీ చేసి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
విశాఖ మన్యం నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న ఆరుగురిని తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వంగలపూడి అనిత