Bear at Ammaji Temple: సత్యసాయి జిల్లా రొళ్ల మండలం జీరిగెపల్లి అమ్మాజీ ఆలయంలో ఎలుగుబంట్ల సంచారం స్థానికులని ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన ఓ ఎలుగుబంటి ప్రసాదం తిని.. చాలా సేపు అక్కడే చక్కెర్లు కొట్టింది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దేవాలయం అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఎలుగుబంట్ల వస్తున్నాయని.. అటవీ అధికారులు చొరవ చూపి వన్యప్రాణులు ఆలయ ప్రాంగణంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని పూజారి కోరుతున్నారు.
ఇదీ చదవండి : నేటి నుంచే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. స్వామివారి కల్యాణానికి హాజరుకానున్న సీఎం జగన్