ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

ప్రధాన వార్తలు @ 7 PM

7pm_Topnews
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Mar 25, 2021, 6:58 PM IST

  • విమానాశ్రయం ప్రారంభం

కర్నూలు విమానాశ్రయాన్ని సీఎం జగన్​ ప్రారంభించారు. కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లులో విమానాల రాకపోకలు కొనసాగుతాయని సీఎం జగన్​ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రజారాజ‌ధానిపై ప‌గ‌బ‌ట్టార‌ని సాక్ష్యాధారాల‌తో వెల్లడైంది: తెదేపా

సీఎం జగన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రడు ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిజస్వరూపం బటయపడిందన్నారు. వీరు సీఐడీని, కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వంగపండు కుటుంబానికి ఆర్థిక సాయం

ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వంగపండు వారసులకు ఈ మొత్తాన్ని చెల్లించాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కరోనా కలవరం

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ.. వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 758 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ టీకా తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఎన్నికల్లో నేతల సిత్రాలు చూడతరమా!

కూటి కోసం కోటి పాట్లు అన్న సామెతకు చెక్ పెడుతూ.. ఓటు కోసం కోటి పాట్లు పడుతున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. కొందరు ఓటర్లను ఆకర్షించేందుకు విభిన్నంగా ఆలోచిస్తూ.. ముందుకు సాగుతున్నారు. బట్టలు ఉతకడం దగ్గరి నుంచి పిల్లలకు స్నానాలు చేయించటం వరకు అన్ని పనులు చేస్తూ మాలో ఒకరన్న భావనను ప్రజలకు కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఎన్నికల సంఘం​ విధుల్లో భాజపా జోక్యం'

బంగాల్​ ఎన్నికల వేళ ఈసీ​ విధుల్లో భాజపా జోక్యం చేసుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారులను బదిలీ చేస్తుండటంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషన్​.. భాజపా కమిషన్​గా మారిందని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఏది నిజం?

కరోనా మహమ్మారి మూలాలు కనుగొనేందుకు పలువురు శాస్త్రవేత్తల బృందం చైనాలో పర్యటించింది. ప్రధానంగా నాలుగు సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ, చైనా శాస్త్రవేత్తలు తమ సంయుక్త పరిశోధన నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ధర ఎంతో తెలుసా?

దేశీయ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్ గురువారం సరికొత్త బైక్​ను విడుదల చేసింది. ఎం 1000 ఆర్​ఆర్​ పేరుతో ప్రీమియం ఫీచర్లతో ఈ బైక్​ను ఆవిష్కరించింది. దీనితో పాటు మరో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బెంజ్​ కూడా భారత్​లో ఏ-క్లాస్​ లిమోసిన్​ సెడాన్​ కారును ఆవిష్కరించింది. వీటి ధరలు, ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • జోరును ఆపగలదా?

భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. పుణె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​లో గెలుపు కోసం ఇరుజట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సినిమా ముచ్చట్లు

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన 'మేజర్'​ టీజర్​ విడుదల వాయిదా పడింది. సందీప్‌ కిషన్, బాబీసింహా ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'రౌడీ బేబీ' చిత్ర టైటిల్​ను 'గల్లీ రౌడీ'గా మార్చారు. ఇంకా పలు చిత్ర విశేషాలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.