ETV Bharat / city

Drugs case: తెదేపా నేతల ఆరోపణలకు భయపడేది లేదు: ఎమ్మెల్యే ద్వారంపూడి - tdp leaders on heroine case

డ్రగ్స్‌ రవాణాపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని.. వాస్తవాలు బయటపడతాయని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెదేపా నేతల అరుపులను లెక్కచేయనని ఘాటుగా స్పందించారు.

ysrcp leader dwarampudi
ysrcp leader dwarampudi
author img

By

Published : Oct 7, 2021, 5:02 PM IST

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

డ్రగ్స్‌ వ్యవహారంలో తెలుగుదేశం నేతల ఆరోపణలకు భయపడేది లేదని.. వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విదేశాలకు వ్యాపారం కోసం వెళ్తారు కానీ.. డ్రగ్స్ దందా కోసం కాదని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ రవాణాపై.. దర్యాప్తు సంస్థల విచారణలో వాస్తవాలు బయటపడతాయన్నారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే.. దీటుగా బదులిస్తానని హెచ్చరించారు.

తెదేపా ఆరోపణలు..వివాదం..

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని తెదేపా జిల్లా కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడలో అగ్నిప్రమాదంలో తగలబడిన బోటులో హెరాయిన్‌ ఉందని తెదేపా నేత పట్టాభి ఆరోపించారని.. బోటు ప్రమాదాన్ని హెరాయిన్‌ రవాణాతో ముడిపెట్టి మత్స్యకారులను దొంగలుగా చిత్రీకరించారంటూ మత్స్యకారులు, వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 వరకు హైడ్రామా నడిచింది. పట్టాభి మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. విషయం తెలుసుకోవడానికి బయటకు వచ్చిన తెదేపా కాకినాడ పార్లమెంటు అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇతర నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తెదేపా నాయకులపై కొందరు అసభ్యపదజాలంతో విరుచుకుపడితే, మరికొందరు దాడికి దిగారు. పోలీసులు తెదేపా కార్యాలయం ప్రధాన గేటు మూసివేసి.. పట్టాభి, చినరాజప్ప, జ్యోతుల నవీన్‌, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర తెదేపా నాయకులను బయటకు రాకుండా చూశారు. పట్టాభి బయటకొచ్చి క్షమాపణ చెప్పే వరకు కదలబోమంటూ మత్స్యకారులు, వైకాపా కార్యకర్తలు పలుమార్లు కార్యాలయం వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పలువురు వైకాపా కార్పొరేటర్లు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి.

మత్స్యకారులను తప్పుపట్టలేదు: పట్టాభి

కాకినాడ ఉప మేయర్‌-2 చోడిపల్లి ప్రసాద్‌, మత్స్యకార ప్రతినిధి ధర్మాడి సత్యం తదితరులు తెదేపా నాయకులతో చర్చలు జరిపారు. చినరాజప్ప కల్పించుకుని మత్స్యకారులను ఉద్దేశించి పట్టాభి ఏమీ అనలేదన్నారు. పట్టాభి మాట్లాడుతూ మత్స్యకారులంటే తనకు గౌరవమనీ, ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశానే తప్ప మత్స్యకారులను తప్పుపట్టలేదని చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. పోలీసులు అందరికీ సర్దిచెప్పి వెనక్కి పంపిస్తుండగా వైకాపా కార్యకర్తలు నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుని, పట్టాభి, చినరాజప్ప, కొండబాబు, వర్మ తదితరులను తమ వాహనంలో బయటకు తీసుకొచ్చారు.

దాడిని ఖండించిన చంద్రబాబు

"రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల డ్రగ్ మాఫియా కార్యకలాపాలను బట్టబయలు చేసిన పార్టీ సీనియర్ నేతలు పట్టాభి, రాజప్ప, కొండబాబు, నవీన్, రామకృష్ణారెడ్డిలు కాకినాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వైకాపా మూకల దాడి దుర్మార్గం. డ్రగ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న మాఫియా నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ మూకతో దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. సాక్ష్యాత్తు ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై డ్రగ్ మాఫియా దాడులకు దిగుతుంటే పోలీసు యంత్రాంగం నిద్రపోతోందా? వైకాపా నేతల నిజస్వరూపం బయటపడుతుందనే భయంతోనే ఎమ్మెల్యే ద్వారంపూడి గూండాలు తెలుగుదేశం నేతలపై దాడులకు దిగారు." -చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేత

ఇదీ చదవండి:

Mundra port drugs: ఎన్‌ఐఏ చేతికి ముంద్రా పోర్టు డ్రగ్స్​ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.