రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు బకాయిలను తక్షణమే చెల్లించాలని.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉండటం వల్ల రైతులు ధాన్యాన్ని మిల్లర్లకే అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాకినాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల్ని, రైతుల్ని మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇంటి పన్ను పెంపుపై కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని... ఇసుక, గ్రావెల్ ఆదాయం వదిలేసి ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం మోపడానికి ప్రభుత్వానికి ఉన్న హక్కు ఏంటని పశ్నించారు.
పెట్రోలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు అంగీకరిస్తే ధరలు తగ్గుతాయని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండీ... Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు