దళారీ వ్యవస్థ మధ్య రైతు మనుగడ కష్టంగా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షను నిమ్మరసం తాగి విరమించారు. బ్రిటీషర్లు వెళ్లినా మన నాయకుల్లో మాత్రం ప్రజల్ని విభజించే ఆలోచన మారలేదని విమర్శించారు. నాయకులు బాగానే ఉన్నారనీ.. రైతులే కన్నీరు పెడుతున్నారని ఆవేదన చెందారు. తాను అధికారం కోసం ఆలోచించే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఇంటికి రూ.9 కోట్లు ఖర్చు పెట్టి రసీదు తీసుకున్నారనీ.. అన్నదాతలు ఇచ్చిన ధాన్యానికి మాత్రం రసీదు ఇవ్వరా అని ప్రశ్నించారు.
అన్నింటినీ కూల్చేస్తున్నారు
వైకాపా ప్రభుత్వం ప్రజావేదికతో కూల్చివేత మొదలుపెట్టి.. అన్నింటినీ కూల్చివేస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. బోటు ప్రమాదంలో అంతమంది చనిపోతే... అసెంబ్లీలో మౌనం పాటించలేదని విమర్శించారు. హుందాగా నడపాల్సిన సభను దూషణలతో నడుపుతున్నారని ఆరోపించారు. తెలుగు భాష, సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలో తమకు తెలుసన్నారు. రైతుల కన్నీరు తుడిచే వరకు ఎన్ని దూషణలైనా భరిస్తామని జనసేనాని తెలిపారు.
ఇవీ చదవండి: