mother and son suspicious death: కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడలోని జెండా సెంటర్‌లో తల్లీకొడుకుల మృతి స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెండా సెంటర్‌కు చెందిన రాసాని సీతమ్మ, రాసాని గోపాలం తల్లీకొడుకులు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. శనివారం మరోసారి గొడవపడ్డారు. క్షణికావేశంలో గోపాలం(42) తల్లి సీతమ్మ(80)పై పెట్రోలు పోసి, తనపైనా పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు ఎగసిపడి తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:
