ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని.. కాకినాడ ఎంపీ వంగా గీత స్పష్టం చేశారు. పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలన్నా హోదాతోనే సాధ్యమన్నారు. వైకాపా ప్రధాన ఎజెండా ప్రత్యేక హోదాయేనని... పార్లమెంటులో రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు జగన్ విశ్వసనీయతకు పట్టం కట్టారన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలోని కీలక సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తామన్నారు.
ఇవి చదవండి...ప్రమాణ స్వీకారానికి సహకరించండి: సీఎస్