భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు కాకినాడలో కొనసాగుతున్నాయి. సూర్యారావుపేట వద్ద సాగరతీరంలో 'టైగర్ ట్రయంప్-2019' పేరిట ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తులు, సునామీలు సంభవించిన సమయంలో సైన్యం స్పందన, అందించాల్సిన సాయంపై ప్రదర్శనలు చేశారు. భారత్ తరఫున ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ ఐరావతం, ఐఎన్ఎస్ గరియాల్, సంధ్యాక్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. అమెరికా నుంచి జర్మన్ టౌన్ యుద్ధ నౌకలు, హెలికాఫ్టర్లు, ట్యాంకులు ప్రదర్శనలో భాగమయ్యాయి. రేపటితో ఈ విన్యాసాలు ముగియనున్నాయి.
ఇదీ చదవండి...