హిందువుల మనోభావాలను కాకినాడలోని అధికారులు దెబ్బతీస్తున్నారంటూ కలెక్టరేట్ వద్ద భాజపా ధర్నా నిర్వహించింది. సుమారు 30 ఏళ్లుగా జగన్నాథపురం వంతెన వద్ద నిర్వహించే గణేశ్ నిమజ్జనాన్ని మరో ప్రాంతానికి తరలించడం పట్ల భాజపా ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా ఘనంగా గణేశుని నిమజ్జనం చేస్తుంటే జిల్లాలో మాత్రం అధికారులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని... తక్షణం వైఖరిని మార్చుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: