తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జగన్నాధపురం హార్బర్ లో బుధవారం చేపల వేటకు వెళ్లే బోటు ఒకటి దగ్ధం అయ్యింది. బోటు లోని వ్యర్థపు నీటిని మోటరు ద్వారా బయటకు తోడుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కు గురై బోటు దగ్ధమైనట్టు నిర్వాహకులు తెలుపుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే అదుపు చేశారు.
ఈ ఘటనపై కాకినాడ ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడలో వరుస బోటు దగ్ధాలు మత్య్స కారులను కలచివేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇది రెండో బోటు అగ్ని ప్రమాదం. ఇలా బోట్లు దగ్ధమయితే తమ ఉపాధిపై భారం పడుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి : Paddy Crop Damage : వరి "వెన్ను" విరిగింది.. అన్నదాత కన్ను చెమ్మగిల్లింది..