ETV Bharat / city

కష్ట కాలంలో భర్త మద్యం సేవించాడని భార్య ఆత్మహత్య - crime news in kurnool district

ఇన్నాళ్లు సంతోషంగా జీవించారు. ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. ఇంతలోనే మద్యం మహమ్మారి వారి ఆనందాలను దూరం చేసింది. కష్ట కాలంలో భర్త మద్యం సేవించటంతో కలత చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూలులో జరిగింది.

కష్ట కాలంలో భర్త మద్యం సేవించాడని వివాహిత ఆత్మహత్య

author img

By

Published : May 6, 2020, 12:15 AM IST

భర్త మద్యం సేవించాడని కలత చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. నగరంలోని నరసింహారెడ్డి నగర్​లో నివాసం ఉంటున్న శివమ్మ భర్త నిన్న మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. కష్ట సమయంలో మద్యం సేవించడం ఏంటని కలతచెందిన శివమ్మ ఇంట్లో భర్త లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: వ్యక్తి ఆత్మహత్య... ఇంటి బాధ్యతే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.