ETV Bharat / city

కోతులకు అంతిమ సంస్కారం.. గ్రామస్థుల ఔదార్యం - monkeys funerals in velamavaripalle in kadapa news

సాధారణంగా సాటి మనిషికి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే పట్టించుకోవడమే ప్రస్తుత రోజుల్లో గగనం. అందునా కరోనా కాలం. సాధ్యమైనంత వరకూ మృతదేహాలకు, మనుషులకు దూరంగా ఉండాలని అంతా అనుకుంటారు. కానీ రెండు కోతులు విద్యుత్​ షాక్​తో ప్రమాదవశాత్తు మరణిస్తే వాటికి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ గ్రామస్థులు. కడప జిల్లా వెలమవారిపల్లెలోని అరుదైన ఘటన పూర్తి వివరాలివి..!

కోతులకు అంతిమ సంస్కారం.. గ్రామస్థుల ఔదార్యం
కోతులకు అంతిమ సంస్కారం.. గ్రామస్థుల ఔదార్యం
author img

By

Published : Jul 28, 2020, 8:24 PM IST

Updated : Jul 28, 2020, 9:18 PM IST

వానరాలకు అంతిమ సంస్కారం నిర్వహించిన గ్రామస్థులు

కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని కె వెలమవారిపల్లె గ్రామంలో రెండు కోతులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్​తో మృతి చెందాయి. ఇది గమనించిన గ్రామస్థులు ఆవేదన చెందారు. కోతుల మృతదేహాలకు స్నానాలు చేయించి.. గుంతలు తవ్వి పూడ్చి పెట్టారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. మానవత్వం మంట కలిసిపోతున్న ఈ కాలంలో కోతులకు దహన సంస్కారాలు చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అక్కడే ఉన్న పిల్లకోతిని సైతం కాపాడి సంరక్షించారు.

ఇదీ చూడండి..

'ఆ మృతదేహాలు మంచినీటి చెరువులో ఖననం చేయొద్దు'

Last Updated : Jul 28, 2020, 9:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.