ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి. ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. రాయచోటి ప్రాంతంలో కరోనా నిధుల పేరుతో వసూళ్లకు పాల్పడింది ఎవరో ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసని శ్రీకాంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.
అధికారులను, అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని... రోజూ పత్రికా సమావేశాలు పెట్టడం తప్ప కరోనా కట్టడికి మీరు చేసింది శూన్యం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిలో కూర్చొని సీఏంవో అధికారులను అడ్డుపెట్టుకొని కమిషన్లు దండుకుంటున్నావు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితుడు నీ అనుచరుడు కాదా?... రాయచోటి పట్టణ ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన బాలరాజుపల్లి ఇసుక క్వారీల నుంచి కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నది నీ అనుచరులు కాదా?... ఇప్పటికైనా ప్రతిపక్షంపై విమర్శలు ఆపి.... రైతాంగాన్ని ఆదుకోవడానికి, కరోనా కట్టడికి చర్యలు తీసుకోండి- శ్రీనివాస్ రెడ్డి, కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు