ETV Bharat / city

viveka murder case: వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్‌కు 10 రోజుల సీబీఐ కస్టడీ - వివేకా మర్డర్​ కేసు తాజా వార్తలు

వైఎస్. వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టైన కీలక అనుమానితుడు  సునీల్ యాదవ్ నోరు విప్పితే... మరికొందరి ప్రమేయం బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హత్య కేసులో సునీల్ ప్రమేయం ఉందని ప్రాథమిక అంచనాకు వచ్చిన సీబీఐ...అతన్ని 10 రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తోంది. నేడు మాజీ డ్రైవర్ దస్తగిరి నుంచి సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేస్తారని తెలుస్తోంది.

viveka murder case
viveka murder case
author img

By

Published : Aug 6, 2021, 3:45 PM IST

Updated : Aug 7, 2021, 3:29 AM IST

వైఎస్ వివేకా హత్యకేసులో దర్యాప్తును సీబీఐ(CBI) వేగవంతం చేసింది. ఈనెల 2న గోవాలో అరెస్టైన సునీల్ యాదవ్‌ను అధికారులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. సునీల్‌ను 13 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసినా...10 రోజులకు మాత్రమే అనుమతి లభించింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కస్టడీకి తీసుకొన్న CBI…ఈనెల 16 వరకు విచారించనుంది. జైలు ఆవరణలోని అతిథి గృహంలోనే సునీల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వాచ్ మెన్ రంగన్న మెజిస్ట్రేట్ ముందు 164 సెక్షన్ కింద ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా....హత్య కేసులో సునీల్ ప్రమేయం ఉందని సీబీఐ (CBI) ప్రాథమిక నిర్థరణకు వచ్చింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించింది. అయితే ఆయుధాల స్వాధీనానికి, హత్యలో ఇతరుల ప్రమేయాన్ని తేల్చేందుకు సునీల్‌ను విచారిస్తోంది. దర్యాప్తు మరింత ముందుకు సాగడానికి సునీల్‌ వాంగ్మూలం కీలకం కానుంది. కస్టడీలో ఉన్న సమయంలో వీలైనంత సమాచారం రాబట్టాలని సీబీఐ ప్రయత్నిస్తోంది.

శుక్రవారం నలుగురు అనుమానితులపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, సుంకేశుల గ్రామానికి చెందిన ఉమా శంకర్ రెడ్డి తో పాటు పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను విచారించారు. నేడు వివేకా కారు డ్రైవర్ దస్తగిరి నుంచి జమ్మలమడుగు కోర్టులో 164 సెక్షన్ కింద వాంగ్మూలం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గోవాలో అరెస్ట్​..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుల్లో ఒకరైన వైకాపా కార్యకర్త యాదటి సునీల్‌ యాదవ్‌ను (26) సీబీఐ అరెస్టు చేసింది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయనను సోమవారం రాత్రి గోవాలో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు సునీల్​ యాదవ్​ను హాజరుపరిచారు. వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన యాదటి సునీల్‌యాదవ్‌ (26) ప్రమేయం ఉందని సీబీఐ పేర్కొంది. అతని పాత్రకు పలు ఆధారాలు దర్యాప్తులో లభించాయని వివరించింది. వివేకా ఇంటివద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో సునీల్‌యాదవ్‌ ప్రమేయం గురించి వెల్లడిస్తోందని చెప్పింది. ఈ హత్యలో ఇతర నిందితుల ప్రమేయం, ఎలా హత్య చేశారు? ఏ ఆయుధాలు వినియోగించారనేది తేల్చాలని, ఆయుధాల్ని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. వీటిన్నింటిపై సునీల్‌యాదవ్‌ను విచారించాలని న్యాయస్థానానికి చెప్పింది. అతనికి 14 రోజుల రిమాండు విధిస్తూ జడ్జి పవన్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. అతన్ని 13 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్‌ వేయగా.. ఈ రోజు న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది.

"వివేకా హత్యకు జరిగిన కుట్ర, కొన్ని నిజాలు సునీల్‌యాదవ్‌కు తెలుసు. మేము అతన్ని విచారించినప్పుడు అవేవీ చెప్పకుండా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నందున మరికొంతమంది సాక్షుల్ని విచారించాల్సి ఉంది. కొన్ని ఆధారాలు కూడా సేకరించాల్సి ఉంది. అతన్ని కస్టడీకి ఇస్తే విచారించి కీలకాధారాలు సేకరించేందుకు వీలవుతుంది. లేకపోతే దర్యాప్తు మరింత జాప్యమై ఇబ్బంది ఏర్పడుతుంది"- అని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది.

ఎవరీ సునీల్‌ యాదవ్‌?

పులివెందుల మండలం మోట్నూంతలపల్లి గ్రామానికి చెందిన సునీల్‌ యాదవ్‌ తండ్రి కృష్ణయ్య.. కొన్నేళ్ల కిందట అనంతపురం వెళ్లి స్థిరపడ్డారు. మద్యం దుకాణం నిర్వహించటంతోపాటు, ఆటోమొబైల్‌ ఫైనాన్స్‌ సంస్థలో పని చేశారు. ఆర్థికంగా కుదేలవ్వటంతో 2016లో తిరిగి పులివెందులకు చేరుకున్నారు. భాకరాపురంలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ కుటుంబం అంతా వైకాపా సానుభూతిపరులు. సునీల్‌ యాదవ్‌ ఆ పార్టీ కార్యకర్త. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ ఇసుక రీచ్‌లో పొరుగుసేవల ప్రాతిపదికన కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశాడు. వివేకానందరెడ్డి సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరి ద్వారా సునీల్‌ యాదవ్‌ వివేకాకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అతను తరచూ వివేకా ఇంటికి వెళ్లేవాడు. వారి మధ్య పలు లావాదేవీలు నడిచినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

viveka murder case: సునీల్‌యాదవ్‌ ప్రమేయంపై ఆధారాలున్నాయి: సీబీఐ

Last Updated : Aug 7, 2021, 3:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.