ETV Bharat / city

చిన్నమ్మతో అసభ్య ప్రవర్తన...చివరకు ఏమైందంటే..!

వావి వరసలు మరచి ప్రవర్తించాడో వ్యక్తి.. బంధువులకు తెలిసి మందలించినా ప్రవర్తనలో మార్పు రాలేదు. బుద్ది మార్చుకోమని ఎంతగానో చెప్పినా.. అదేరీతిగా ప్రవర్తించాడు.. ఈ క్రమంలోనే వారి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తులైన బంధువుల దాడిలో అతను మృతి చెందాడు.

హత్య
హత్య
author img

By

Published : Nov 10, 2021, 3:43 PM IST

కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తప్పుగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని.. పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. ఈ క్రమంలో చిన్నరాత్రి జరిగిన గొడవలో.. కుటుంబ సభ్యులంతా అతనిపై దాడి చేయగా... అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్​లో జరిగింది.

ఏం జరిగింది..

కడపలోని అశోక్​ నగర్​కు చెందిన మహబూబ్​ బాషా పెయింటర్​గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో మహబూబ్ బాషా తన చిన్నమ్మతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం అతని చిన్నాన్నకు తెలియడంతో ఎందుకు ఇలా చేస్తున్నావనీ బాషాను మందలించాడు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. రాత్రి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు మహబూబ్ బాషాను కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బాషా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

NARA LOKESH: 'జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. విధ్వంసం మాత్రమే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.