దసరా పండుగ సందర్భంగా... కడప ఆర్టీసీ జోన్ పరిధిలో 935 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బెంగళూరు, విజయవాడ, చెన్నై, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాలకు ఈ బస్సులను ఏర్పాటు చేశారు. అనుమతి రానందున హైదరాబాద్కు నడపడం లేదని తెలిపారు.
అనుమతి రాగానే 200 సర్వీసులను నడుపుతామని కడప ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదాం సాహెబ్ తెలిపారు. వీటినకి ముందస్తు రిజర్వేషన్ ఏర్పాటు చేశామని, ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని సర్వీసులను నడుపుతామన్నారు.
ఇదీ చదవండి: