Indigo Services: కడప విమానాశ్రయం నుంచి 5 నెలలుగా నిలిచిపోయిన విమాన సర్వీసులు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉడాన్ పథకం ద్వారా కడప నుంచి ట్రూజెట్ విమానయాన సంస్థ వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడిపింది. సాంకేతిక కారణాలతో గత ఏడాది నవంబర్ నుంచి ట్రూజెట్ సేవలు నిలిచిపోయాయి. కడప నుంచి విమాన యానానికి డిమాండ్ పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇండిగో సంస్థతో ఒప్పందం చేసుకుంది. కడప నుంచి వివిధ ప్రాంతాలకు అలాగే హైదరాబాద్‌కు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
ఇదీ చదవండి: cm jagan : 11న మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ?