ETV Bharat / city

GANDIKOTA CANAL WORKS: జీఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ విస్తరణకు.. ప్రభుత్వ శ్రీకారం

GANDIKOTA CANAL WORKS: జీఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా గండికోట జలాశయం నుంచి కాలువను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కాలువ విస్తరణ పనులకు రూ.323 కోట్లు అవసరమని అధికారులు తేల్చారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగించింది.

GNSS PROJECT
GNSS PROJECT
author img

By

Published : Feb 3, 2022, 1:45 PM IST

GANDIKOTA CANAL WORKS: కడప జిల్లాలో గండికోట జలాశయం నుంచి 56 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కాలువను మరింత వెడల్పు చేయడానికి రూ.323 కోట్లు అవసరమని జలవనరుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు నివేదించారు. పనుల అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌ 1న ఉత్తర్వులు జారీ చేస్తూ రూ.305.70 కోట్లకు పరిపాలనామోదం ఇచ్చింది. ఇంజినీరింగ్‌ అధికారులు రెండు ప్యాకేజీలుగా విభజన చేశారు. కరవు సీమకు గుండెకాయ లాంటి గండికోట నుంచి 0-36.640/34.092 కిలోమీటరు వరకు రూ.170 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 నిర్మాణ ధరలను (ఎస్‌ఎస్‌ఆర్‌) అనుసరించి సుమారు రూ.157.41 కోట్ల విలువ చేసే పనులు అప్పగించడానికి 2021, నవంబరులో గుత్తపత్రాలు ఆహ్వానించారు. రెండు గుత్తేదారు సంస్థలు పోటీపడ్డాయి. గుత్తపత్రాలను గతేడాది డిసెంబరులో తెరిచారు. రివర్స్‌ టెండర్ల విధానం అనుసరించడంతో రూ.7,08,37,533 ఆదా అయింది. ఓ గుత్తేదారు సంస్థ రూ.151,14,42,459 (-0.5368 శాతం) నమోదు చేసింది. అతి తక్కువ విలువకే చేసేందుకు ముందుకు రావడంతో రూ.150,33,29,788తో పనులు చేసే బాధ్యతను ఆ సంస్థకే ఇంజినీర్లు అప్పగించారు. పనులు చేయాలని నెల కిందట ఒప్పందం జరిగింది. మూడేళ్ల పాటు గడువిచ్చారు.

32.640/34.092 కిలోమీటర్ల నుంచి 56 కిలోమీటర్ల వరకు కాలువ విస్తరణకు రూ.130 కోట్లు కావాలని ఇంజినీర్లు అంచనా వేశారు. ఇందులో రూ.118,10,96,655.75 విలువ చేసే పనులకు రివర్స్‌ టెండర్లు పిలిచారు. ఓ గుత్తేదారు 113,40,34,235కే చేసేందుకు ముందుకొచ్చారు. అంటే ప్రభుత్వానికి రూ.4,72,43,864 నిధులు ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ గుత్తేదారు 0.016 శాతం తక్కువకు నమోదు చేయడంతో రూ.113,38,52,791.75కే చేసేవిధంగా ఒప్పందం జరిగింది. విస్తరణ, ఆధునికీకరణ పనులు చేయడానికి మూడేళ్లు గడువు ఇచ్చినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.

ఈ రెండు ప్యాకేజీల అంచనా విలువ రూ.275.52 కోట్లు కాగా, రివర్స్‌ టెండర్లతో రూ.11.80 కోట్లు మిగిలింది. గుత్తేదారులు రూ.264.54 కోట్లతో చేస్తామని పనులు దక్కించుకోగా నిర్దేశిత అంచనా విలువతో అతి తక్కువ లెస్‌తో నమోదు చేసి రూ.263.71 కోట్లతో చేసేందుకు అంగీకరించారు. లెస్‌కు వేయడంతో రూ.82.94 లక్షల భారం తప్పింది.

నష్టాన్ని తగ్గించేందుకు..

కడప శ్రీకృష్ణదేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో(జీఎన్‌ఎస్‌ఎస్‌) భాగంగా గండికోట జలాశయం నుంచి కాలువను విస్తరించాలని 10 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం జల స్ఫూర్తితో సంకల్పించింది. ఇప్పటి కంటే కృష్ణా జలాల ప్రవాహ వేగంతోపాటు మరింత సామర్థ్యం పెంచాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కరవు సీమలో నీటి నడకలతో జరిగే నష్టాన్ని తగ్గించేందుకు సిమెంటు కాంక్రీటు పూత వేయాలని అనుమతులిచ్చారు. బృహత్తర జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పథకాలను అనుసంధానం చేయాలని పాలకులు పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలో మునుపటి కంటే మరింత వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టారు.

కరవు సీమకు కృష్ణవేణి...

కరవు సీమకు కృష్ణా జలాలను తరలించాలనే సదాశయంతో జీఎన్‌ఎస్‌ఎస్‌ 56 కిలోమీటర్ల నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా 2,800 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని తరలించేందుకు పది చోట్ల ఎత్తిపోతలను నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఈ రెండు బృహత్తర పథకాలను అనుసంధానం చేయాలని 2020, ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ.5,036 కోట్లకు పరిపాలన ఆమోదం ఇచ్చారు. జిల్లాలోని రాయచోటి, పులివెందుల, రాజంపేట నియోజకవర్గాల్లోని 95 వేల ఎకరాలు, చిత్తూరులో 2 లక్షల ఎకరాలకు సేద్యపు జలాలివ్వాలని రూపకల్పన చేశారు. వరద కాలువ నుంచి ఈ రెండు జిల్లాల ఆయకట్టును సస్యశ్యామలం చేయడానికి 20 టీఎంసీలను తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని 10 చోట్ల ఎత్తిపోతలను చేపట్టడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఎందుకోసం చేస్తున్నారంటే?

జీఎన్‌ఎన్‌ఎస్‌ మొదటి దశలో.వామికొండ సాగర్‌ (1.60 టీఎంసీలు)లోకి 23.92 కిలోమీటర్ల నుంచి, సర్వరాయసాగర్‌ (3.06 టీఎంసీలు)లోకి 32.601 కిలోమీటర్ల నుంచి నీటిని మళ్లిస్తున్నారు. రానున్న రోజుల్లో 0-32.640 కిలోమీటర్ల వరకు ఆరు వేల క్యూసెక్కులు ప్రవహించేవిధంగా ఇటీవల ఆకృతి రూపొందించారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ రెండో దశ ప్యాకేజీ-1లో గతంలో 2,896.54 క్యూసెక్కుల నీరు వెళ్లేవిధంగా పనులు చేపడుతున్నారు. భవిష్యత్తు అవసరాల నిమిత్తం 5 వేల క్యూసెక్కులకు పెంచాలని ఇటీవల ప్రతిపాదించారు. మొత్తం 0-56 కిలోమీటరు దాక ఇప్పటి కాలువను మరింత వెడల్పు చేసి సిమెంటు లైనింగ్‌ వేయనున్నారు. ఈ పనులు పూర్తయితే దిగువనున్న రెండో దశలో ప్యాకేజీ 2-7 వరకు జిల్లాలో లక్ష ఎకరాల వరకు సాగునీరందనుంది. చిత్తూరు జిల్లాలో 1,03,500 ఎకరాలు, నెల్లూరులోనూ 1,500 ఎకరాలకు ఆధునికీకరణ చేసే కాలువ ద్వారా కృష్ణా జలాలు తరలించాల్సి ఉంటుంది.

కాలువ విస్తరణతో సామర్థ్యం పెంపు...

''జిల్లాలో గండికోట జలాశయం నుంచి 56 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న జీఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచాలని నిర్ణయించాం. కాలువను మరింత వెడల్పు చేసి సిమెంటు లైనింగ్‌ వేయడానికి, వంతెనలు, ఇతర కట్టడాలు నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది. గతేడాది ఏప్రిల్‌లో రూ.305.70 కోట్లకు అనుమతిచ్చింది. మూడేళ్లలోపు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించాం. పనులు వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం." - కె.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సీఈ, జలవనరుల శాఖ, కడప

ఇదీ చదవండి: MLA MEDA MET COLLECTOR: జిల్లా కేంద్రంపై కలెక్టర్​కు ఎమ్మెల్యే మేడా వినతిపత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.