బద్వేలు ఉపఎన్నిక ప్రచార గడువు ముంచుకొస్తున్న వేళ విమర్శలు, ప్రతి విమర్శల దాడి పెరిగింది. ప్రచారం బుధవారంతో ముగుస్తున్నందున రాజకీయ వేడి మరింత పెరిగింది. కేంద్రం విభజన హామీలు అమలు చేస్తే బరి నుంచి తప్పుకొంటామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టులను కేటాయించాలని తేల్చి చెప్పారు. బద్వేలు ఉప ఎన్నికల్లో భాజపా నేతలు ఆర్మీని రంగంలోకి దింపినా భయపడబోమన్నారు.
పోలీసులను మార్చండి...
అధికార పార్టీ నేతలు బద్వేలు పరిధిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారని భాజపా నేతలు విమర్శించారు. వాలంటీర్లతోనూ ప్రచారం చేయిస్తున్నారంటూ కడపలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు భీష్మకుమార్‌కు ఫిర్యాదు చేశారు. బద్వేలులో ఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు పోలీసులను వెంటనే మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విఙ్ఞప్తి చేశారు.
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి...
ఇక బద్వేలు బరిలో తమ పార్టీని గెలిపించాలంటూ కాంగ్రెస్ నాయకుడు తులసి రెడ్డి ఓటర్లను కోరారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతుంటే రెండున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు.
ఇదీచదవండి.