కడప యోగివేమన విశ్వవిద్యాలయాన్ని జాతీయస్థాయిలో... ఆదర్శవంతమైన యూనివర్సీటీగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హామీఇచ్చారు. యోగివేమన విశ్వవిద్యాలయం అభివృద్ధిపై ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష చేశారు. ప్రొఫెసర్ల కొరత బాగా ఉందని... త్వరలోనే 1100 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వర్సటీ ఆవరణలో మొక్కలు నాటారు. విశ్వవిద్యాలయాల పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-'చిత్తశుద్ధి ఉంటే... ఉచిత ఇసుక విధానం ప్రకటించండి'