కడప నగరంలోని 25 వేల మంది పేద కుటుంబాలకు 500 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు. దాతలు అందజేసిన వాటిలో కోటి 20 లక్షల రూపాయల నిత్యావసర వస్తువులతో కిట్లు తయారు చేశారు. ఆ కిట్లను పేదలకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పంపిణీ చేశారు. నగరంలోని 50 డివిజన్లలోని పేదలకు 25 వేల కిట్లను వాలంటీర్ల సాయంతో ఇళ్లకు వెళ్లి అందిస్తారని ఆయన తెలిపారు. నెలరోజుల నుంచి పనులు లేక చాలామంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నట్లు గుర్తించామన్న ఆయన.. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సాయం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం, కందిపప్పు అందిస్తోందని అన్నారు.
ఇవీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక