తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని.. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు తులసిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో 16 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఆయన అన్నారు.
కడపలో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం ఓటమిని ముందే ఒప్పుకుందని.. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉన్నారని తులసిరెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి అయినందున వారేమీ మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క అడుగు తగ్గినప్పటికీ సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. రైతులకు సున్నా వడ్డీ విషయంలో వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మోటార్లకు మీటర్లను బిగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని.. కాదని బిగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని తొలగిస్తామని తులసిరెడ్డి అన్నారు.
ఇవీ చదవండి..