ETV Bharat / city

YS Viveka murder case: వివేకా హత్య కేసులో 100వ రోజు సీబీఐ విచారణ

viveka case
viveka case
author img

By

Published : Sep 15, 2021, 8:10 AM IST

Updated : Sep 15, 2021, 11:45 AM IST

08:08 September 15

viveka case taza

మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 100వ రోజు కొనసాగుతోంది. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వేస్తున్నారు. నిన్న సాయంత్రం వివేకా ఇంట్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఇవాళ కూడా సీబీఐ అధికారులు పరిశీలన చేస్తున్నారు. నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ఎలా వచ్చారన్న దానిపై సీబీఐ ఆరా తీస్తున్నారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి ప్రవేశించినట్లు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు వ్యక్తుల పేర్లతో స్టిక్కర్లు అంటించుకుని ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిని అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం ఆరా తీస్తున్నారు సీబీఐ అధికారులు.

2019 మార్చి 15న వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసంలోనే కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి మాజీ మంత్రిని దుండగులు హతమార్చారు. ఆ తరువాత విచారణ సమయంలోనూ రాజకీయంగానూ అనేక సమీకరణాలు మారుతూ వచ్చాయి. దీని పైన విచారణ చేస్తున్న సీబీఐ కొంతకాలంగా విచారణ వేగం పెంచింది. అనుమానితులను అందర్నీ పిలిచి విచారించింది. హత్య కేసులో కీలకంగా భావిస్తున్న వ్యక్తుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. 

వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు పురోగతి సాధిస్తున్నారు. హత్యకు వినియోగించిన ఆయుధాల కోసం ఇటీవల తనిఖీలు చేపట్టిన సీబీఐ అధికారులు.. ఎట్టకేలకు వాటిని కనుగొన్నారు. అనుమానితుల ఇళ్లలోనే అధికారులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌ను ఇచ్చిన కీలక సమాచారంతో  అధికారులు మారణాయుధాల ఆచూకీ పట్టగలిగారు. 

ఇదీ చదవండి: DRUGS CASE: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి ముమైత్​ఖాన్​

Last Updated : Sep 15, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.