వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. గంగిరెడ్డి గతంలో 201 సెక్షన్ కింద అరెస్టై బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం బెయిల్ రద్దుచేసి కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు.
నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కడప జైలు నుంచి ఉమాశంకర్ రెడ్డిని 4 రోజుల కస్టడీకి సీబీఐ అధికారులు తీసుకున్నారు. కస్టడీకి ముందు ఉమాశంకర్‌రెడ్డికి వైద్యపరీక్షలు చేయించాలని పులివెందుల కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో ఉమాశంకర్‌రెడ్డిని విచారించాలని స్పష్టం చేసింది. ఇక వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నను కడపలో సీబీఐ అధికారులు విచారించారు.
ఇదీచదవండి.