వై. ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 110వ రోజూ కొనసాగింది. నిందితులను గుర్తించేందుకు సీబీఐ అధికారులు ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నను జైలుకు తీసుకెళ్లి, నిందితులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేయించారు. జమ్మలమడుగు కోర్టు అనుమతితో కడప జైలులో ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించారు.
కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉమాశంకర్ రెడ్డిని గుర్తించేందుకు అతనితో పాటు మరో నలుగురు ఖైదీలతో పరేడ్ ఏర్పాటు చేశారు. 164 సెక్షన్ కింద వాచ్మెన్ రంగన్న.. మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ముగ్గురు నిందితుల పేర్లు చెప్పినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన వారిలో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి ఉన్నట్లు చెప్పారు. ఉమాశంకర్ రెడ్డిని రంగన్న గుర్తించాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి.