ETV Bharat / city

మహారాష్ట్రలో కడప యువకులు.. సాయం చేసిన ఎస్పీ అన్బురాజన్

author img

By

Published : Apr 20, 2020, 7:43 AM IST

'సార్.. మేం మొబైల్ మార్కెటింగ్ ఉద్యోగాల కోసం మహారాష్ట్ర వచ్చాం.. కరోనా లాక్​డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకున్నాం.. భోజనానికి, వసతికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా గోడు ఆలకించి స్వగ్రామాలకు తీసుకెళ్లేలా చూడండి సార్..' అంటూ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​ను మహారాష్ట్రలో చిక్కుకున్న యువకులు అర్థించారు. వీరి వేదనకు చలించిన ఎస్పీ వెంటనే స్పందించి వారికి సహాయం అందేలా చేశారు.

cadapa youth struck in maharastra due to corona lockdown and sp anburajan helps to them
కడపలో చిక్కుకున్న మహారాష్ట్ర యువకులు

కడప జిల్లా రాయచోటి, రైల్వేకోడూరు, బద్వేలు, చిట్వేలి ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది యువకులు.. మొబైల్ మార్కెటింగ్ ఉద్యోగాల కోసం 3 నెలల క్రితం మహారాష్ట్ర వెళ్లారు. కంపెనీ ఏర్పాటు చేసిన గదుల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకున్నారు. ఇంతలో కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వారు అక్కడే చిక్కుకుపోయారు. కంపెనీ యాజమాన్యం కొన్ని రోజులపాటు వారి బాగోగులు చూసింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. తమ ఇబ్బందుల గురించి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడి వారికి ఆహారం, వసతి అందేలా ఏర్పాట్లు చేశారు. త్వరలోనే స్వస్థలాలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న మహేశ్వర్ రెడ్డి కడప జిల్లావాసి. ఆయన చొరవతోనే యువకులకు సహాయం అందింది. తమ గోడు ఆలకించి వెంటనే తమకు సహాయం చేసిన జిల్లా ఎస్పీ అన్బురాజన్​కు యువకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి..

15 రూపాయల కక్కుర్తి షాపును సీజ్ చేయించింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.