ETV Bharat / city

ORGANIC FARMING : తామర తెగులుకు టాటా...సేంద్రీయ సాగుతో అధిక దిగుబడి

author img

By

Published : Jan 19, 2022, 12:38 PM IST

తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంటను నల్లతామర పురుగు నాశనం చేసింది. వేలకు వేలు పోసి పురుగుమందులు కొట్టినా కనీస పెట్టుబడులూ దక్కని దుస్థితి. అందుకు భిన్నంగా సేంద్రీయ విధానంలో మిర్చిసాగు ద్వారా మంచి ఫలితాలు సాధించారు గుంటూరు జిల్లాకు చెందిన బాలశశికాంత్. అతి తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకోవటంతో పాటు చెప్పుకోదగిన దిగుబడి సాధించారు.

సేంద్రీయ సాగుతో అధిక దిగుబడి
సేంద్రీయ సాగుతో అధిక దిగుబడి

అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సేంద్రీయ సాగుతో మెరుగైన ఫలితాలు సాధించాడు గుంటూరు జిల్లాకు చెందిన యువరైతు. వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన బాల శశికాంత్ ఐదేళ్లుగా ప్రకృతి సాగు ద్వారా మిర్చి పండిస్తున్నారు. ఈసారి మిర్చికి త్రిప్స్ పార్విస్పైనస్ అనే కొత్తరకం తామరపురుగు సోకడంతో రాష్ట్రవ్యాప్తంగా మిర్చి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పంటను కాపాడుకునేందుకు రైతులు వేలాది రూపాయలు వెచ్చించి ఎన్నిరకాల మందుకు కొట్టినా తామర పరుగును అదుపు చేయలేకపోయారు. ఫలితంగా ఎకరాకు 2 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. చాలాచోట్ల ముందుగానే మిర్చి పంటను తీసివేశారు. కనీసం కూలీ ఖర్చులూ రావని వదిలేశారు.

బలం కోసం జీవామృతం...

ఇందుకు భిన్నంగా శశికాంత్ మాత్రం మంచి దిగుబడి సాధించారు. మిగతా రైతుల పొలంలో మాదిరిగానే శశికాంత్ మిరప పంటకూ తామర తెగులు సోకింది. అయితే తగిన జాగ్రత్తలతో పురుగును కట్టడి చేశారు. పురుగుమందుల జోలికి వెళ్లకుండా సేంద్రీయ పద్ధతులను పాటించారు. పంటకు బలం కోసం జీవామృతం వినియోగించారు. అలాగే పురుగును నియంత్రించేందుకు ప్రత్యేక ద్రావణాన్ని తయారు చేశారు. భూమిలో 3నుంచి 6 అడుగుల లోతులో ఉండే మట్టిని తీసి 200 లీటర్ల నీటిలో కలిపారు. దానికి కంకర దుమ్ము, బొగ్గు కలిపారు. అల్లం, వెల్లుల్లి, మిర్చిని రుబ్బి ఆ మిశ్రమాన్ని జోడించారు. నాలుగు రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని పంటపై చల్లారు. దీంతో పురుగు ఉద్ధృతిని చాలావరకు నియంత్రించినట్లు శశికాంత్ తెలిపారు.

రాత్రిపూట మాత్రమే...

సహజసిద్ధమైన ద్రావణాలకే పరిమితం కాకుండా మరికొన్ని చిట్కాలు పాటించారు. పొలంలో పసుపురంగు జిగురు అట్టలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా బంతిపూల మొక్కలు నాటారు. దీనివల్ల పురుగులు మొదటగా బంతిపూల మొక్కలవైపు వెళ్లి మిర్చిపంటకు జరిగే నష్టం తగ్గుతుందని శశికాంత్‌ అంటున్నారు. అలాగే సొంతంగా తయారు చేసిన ద్రావణాన్ని సైతం రాత్రిపూట మాత్రమే పిచికారీ చేసేవాళ్లమని ఆ సమయంలోనే పురుగులు మొక్కల లోపల నుంచి బయటకు వస్తాయని తెలిపారు. పురుగు మందుల జోలికిపోకుండా సేంద్రీయ పద్ధతిలో సాగుచేయడంతో పెట్టుబడి తగ్గడమే గాక తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోగలిగానని శశికాంత్ అన్నారు.

సేంద్రీయ సాగుతో అధిక దిగుబడి

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.