గుంటూరు శివరామనగర్లో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. గుంటూరు చుట్టుగుంటకు చెందిన దాసరి ఏసుబాబుకు.. జ్యోతితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత కొంతకాలంగా తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఏసుబాబు అనుమానిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఈ విషయమై వారిమధ్య వివాదం జరుగుతోంది. ఆదివారం అర్థరాత్రి జ్యోతి నిద్రిస్తున్న సమయంలో కొబ్బరి బొండాల కత్తితో మెడమీద నరికి ఆమెను హత్యచేశాడని నగరపాలెం సీఐ తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి.