20వ రోజూ సాగుతున్న తుళ్లూరు రైతుల మహాధర్నా - 20వ రోజూ సాగుతున్న తుళ్లూరు రైతుల మహాధర్నా
రాష్ట్రం కోసం రాజధానికి భూములివ్వడమే తాము చేసిన తప్పా అంటూ తుళ్లూరు రైతులు 20వ రోజూ మహధర్నాకు దిగారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితాలను... ప్రభుత్వ నిర్ణయం కుదిపేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను పట్టించుకోని కమిటీలను వేస్తే వేసీ ఏం లాభమని ప్రశ్నించారు.