ETV Bharat / city

అమరావతిపై కక్షతో.. పారిశుద్ధ్య పనులను కూడా గాలికొదిలేశారు

Garbage collection in Amravati: రాజధాని అమరావతిలో నిర్మాణాలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం.. అక్కడి ప్రజలకు అందించాల్సిన సేవలపైనా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గ్రామాల్లో చెత్త సేకరణ,పారిశుద్ధ్య పనుల కోసం గత ప్రభుత్వ హయాంలో తెప్పించిన లక్షల విలువైన యంత్రాలను మూలన పడేయటంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. అమరావతిపై ప్రభుత్వం కక్షగట్టడం వల్లే ఈ విధంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

garbage collection in Amravati
garbage collection in Amravati
author img

By

Published : Oct 9, 2022, 11:35 AM IST

Updated : Oct 9, 2022, 12:27 PM IST

Cleaning Machine in Amaravati: రాజధాని అమరావతిలో నిర్మాణాలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం.. అక్కడి ప్రజలకు అందించాల్సిన సేవలపైనా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనుల కోసం గతం ప్రభుత్వ హయాంలో తెప్పించిన లక్షల విలువైన యంత్రాలను మూలన పడేయటంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. అమరావతిపై ప్రభుత్వం కక్షగట్టడం వల్లే ఈ విధంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో వాహనం విలువ 60లక్షలపైమాటే: అమరావతి పరిధిలోని గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు, వ్యర్థాలను తరలించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ ఆధునిక యంత్రసామాగ్రిని కొనుగోలు చేసింది. వీటిని తుళ్లూరు పాత సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉంచారు. వీటిలో హైడ్రాలిక్ యంత్రాలతో పాటు అధునిక డస్ట్ బిన్లు ఉన్నాయి. ఒక్కో వాహనం విలువ 60లక్షలపైమాటే. ఇలాంటి వాహనాలు పదికి పైగా అక్కడ మూలన పడేసి ఉన్నాయి. భారీ సంఖ్యలో తెప్పించిన చెత్త డబ్బాలు సైతం వృథాగా పడేశారు. ప్రతి వీధిలోనూ డస్ట్ బిన్లు ఏర్పాటు చేసి ఇళ్లలో పోగయ్యే చెత్తను అక్కడ వేయాలి.

తుప్పుపట్టి పాడైపోతున్న వాహనాలు: హైడ్రాలిక్ యంత్రాలతో కూడిన వాహనం ద్వారా ఆ డస్ట్ బిన్లలోని చెత్తను తరలించి డంపింగ్ యార్డుకు చేర్చాల్సి ఉంటుంది. ఇలా చెత్తను సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉద్దేశించిన వాహనాలు ఇప్పుడు తుప్పుపట్టి పాడైపోతున్నాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ శిథిలమవుతున్నాయి. వీటిని మంగళగిరి, తాడేపల్లి పురపాలికలకు కేటాయిస్తామని గతంలో అధికారులు ప్రకటించారు. కానీ ఆ పని చేయకుండా వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతికి వచ్చే వారికి ఈ ప్రాంతం పరిశుభ్రంగా కనిపించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి వాహనాలు తెప్పించారు. ఈ వాహనాలపై అమరావతి లోగో ముద్రించారు. నీలి హరిత అమరావతి అనే ట్యాగ్ లైన్ జోడించారు. ఈ వాహనాలను రాజధాని పరిధిలోని గ్రామాలకు పంపిణి చేయాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ రావటంతో ఆ ప్రక్రియ అప్పట్లో ఆగిపోయింది.

దీంతో వాహనాలను పాత సీఆర్డీఏ కార్యాలయ ప్రాంగణంలో ఉంచేశారు. ఇప్పుడవి పనికిరాకుండా పోయాయి. వాహనాల్లో సైతం పిచ్చిమొక్కలు, కంపచెట్లు మొలిచాయి. అమరావతిని నిర్మించకుండా అభివృద్ధిని అటకెక్కించిన ప్రభుత్వం... ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యహరిస్తోందని రాజధాని రైతులు మండిపడుతున్నారు.

"అప్పటి ప్రభుత్వం ఇక్కడ పారిశుద్ధ్యం కోసం లక్షల రూపాయలతో కొనుగొలు చేసన వాహనాలను ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజల సొమ్ము కనుకనే వాటిని పట్టించుకోవడం లేదు. ఒక్కవాహనం 60 లక్షలు విలువచేస్తుంది. ఈ వాహనాలను గాలికి వదిలేశారు". _అమరావతి పరిధిలోని గ్రామస్థులు

లక్షల విలువైన యంత్రాలను మూలన పడేసిన ప్రభుత్వం

ఇవీ చదవండి:

Last Updated : Oct 9, 2022, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.