ETV Bharat / city

Farmers Agitation : రోడ్డెక్కిన అన్నదాత.. పరిహారం కోరుతూ రాష్ట్రవ్యాప్త నిరసన - కడపలో రైతుల ఆందోళనలు

Farmers Agitation : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. రైతు సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టారు. బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్​ చేశారు.

Agitations for pay compensation to farmers
రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్రవ్యాప్త నిరసనలు
author img

By

Published : Dec 13, 2021, 4:48 PM IST

Agitations for compensation to farmers ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతు సంఘం, సీపీఐ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రైతులను ఆదుకోకపోతే దశలవారీ ఆందోళనలు చేపడతామని ప్రకటించారు.

నెల్లూరు జిల్లాలో..
Agitations At Nellore: అకాల వర్షం, వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్​తో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుసంఘం నేతలు ధర్నా చేపట్టారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రైతు సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో దాదాపు రూ.1500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. ఎకరాకు రూ.లక్ష వరకు రైతులు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. పంట నష్టం జరిగిన రైతులకు రూ. 50వేల పరిహారమిచ్చి ఆదుకోవాలని.. పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు.

కడప జిల్లాలో..
Agitations At Kadapa: కడప నగరంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన పేదలకు పరిహారం ఇవ్వాలని కోరుతూ.. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆద్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రజా సంఘాల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నగరంలో రహదారులు అద్వాన్నంగా తయారయ్యాయని.. వాటి మరమ్మతులకు చర్యలు చేపట్టాలని నినదించారు. నగరవాసుల సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కడప కార్పొరేషన్​లో సర్వసభ్య సమావేశం సమయంలో లోపలికి వెళ్లేందుకు ప్రజాసంఘం నాయకులు యత్నించారు. దీంతో ఐక్య వేదిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

గుంటూరు జిల్లాలో..
Agitations At Guntur: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సంఘం నాయకులు, సీపీఐ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణ సాయ కింద ఆహార పంటలకు రూ. 25వేలు, వాణిజ్య పంటలకు రూ. 50 వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు.

వ్యవసాయ కమిషనర్ కార్యాలయ ముట్టడి..
ఓ వైపు అధిక వర్షాలు.. మరోవైపు నకిలీ విత్తనాలు, తెగుళ్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ కౌలురైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరులోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముట్టడిలో వివిధ జిల్లాలకు చెందిన రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆ జిల్లాలోనే 2లక్షల ఎకరాల్లో పంటనష్టం..
అకాల వర్షాలు, వరదలతో ఒక గుంటూరు జిల్లాలోనే 2లక్షల ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్లు నేతలు తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతు నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పరిహారంపై నోరు మెదపడం లేదు..
కర్నూలు జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా నష్టపోయామని జిల్లా నుంచి వచ్చిన రైతులు పేర్కొన్నారు. అధికారులు పరిశీలించి నకిలీ విత్తనాల వల్లే నష్టం జరిగినట్లు తేల్చినా.. ఇప్పటి వరకూ పరిహారంపై నోరు మెదపడం లేదన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం నుంచి పరిహారం అందితేనే అన్నదాతలు నిలదొక్కుకోగలరని నేతలు అన్నారు. తక్షణమే సర్కారు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..

Interim Bail to Lakshmi Narayana: విశ్రాంత ఐఏఎస్‌ లక్ష్మీనారాయణకు మధ్యంతర బెయిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.